![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -28 లో.... నందు తన పెళ్లి గురించి సింహాద్రితో మాట్లాడుతుంది. దాంతో నువ్వే అనుకున్నాను ఇంట్లో అందరు ఇలాగే ఉన్నారు కదా.. తండ్రి పోయి రెండు రోజులు కూడా అవ్వలేదు.. అప్పుడే పెళ్లి కావాలట అని భువన అంటుంది. అది మాట్లాడిన సందర్భం తప్పు కావచ్చు కానీ తప్పు మాట్లాడలేదు.. పెళ్లి వరకు వచ్చి ఆగిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది.. మీకు తెలియనిది కాదని భువనతో జానూ అంటుంది.
ఆ తర్వాత పెళ్లి గురించి ఇప్పుడే అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు.. వాళ్లకి తండ్రి చనిపోయిన బాధ ఏ మాత్రం కూడా లేదని అనుకోరా అని శారద కోప్పడుతుంది. నాకు బాధగానే ఉంది కానీ పెళ్లి వరకు వచ్చి ఆగిపోతే నా పరిస్థితి గురించి ఆలోచించారా అని నందు అంటుంది. ఆ తర్వాత మురళి వంక వాళ్ళ అమ్మ శారదా కోపంగా చూస్తుంది. ఏంటి అమ్మా .. అలా చూస్తున్నావని మురళి అడుగుతాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి.. నువ్వు ఆ ఇంటికి వెళ్లకని.. నీ దగ్గర మాట తీసుకున్నాను.. నా తమ్ముడు లేడు.. ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి.. ఆ నందు చూసావా ఎలా మాట్లాడుతుందోనని శాంతి అంటుంది. తప్పు ఎవరిది నీది కదా.. ఎందుకు వాళ్ళతో అలా కోపంగా మాట్లాడావని మురళి అడుగుతాడు. మరొకవైపు జానూ దేవుడికి మొక్కుకుంటుంది. ఆ తర్వాత ఏంటీ జానూ పిలిచావని సూర్య అడుగుతాడు. రెండు హెల్ప్ లు కావాలని జానూ అంటుంది. నాకు ఇప్పుడు జాబ్ కావాలి.. ఇంకొకటి అక్క పెళ్లి అమెరికా అబ్బాయితో జరిపించాలని జానూ అనగానే జరిపిద్దామని సూర్య అంటాడు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడుదామని జానూ అనగానే ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు.
వెళ్లేసరికి అబ్బాయి బ్యాగ్ రెడీ చేసుకుంటాడు. ఎందుకు బ్యాగ్ రెడీ చేస్తున్నారని జానూ అడుగుతుంది. మా వాడు అమెరికా వెళ్ళడానికి పది రోజులు టైమ్ ఉంది. ఇప్పటి నుండే ప్యాక్ చేసుకుంటున్నాడని అబ్బాయి వాళ్ళ నాన్న అంటాడు. ఈ పెళ్లి జరగదని వాళ్ళు అంటారు. మేము పెళ్లి ఘనంగా చేస్తాం.. మీరు అనుకున్నట్ల తోట ఇస్తామని జానూ చెప్తుంది. తోట ప్రాబ్లమ్ లో ఉందని సింహాద్రి అంకుల్ చెప్పాడని అబ్బాయి అంటాడు. తోట రిజిస్ట్రేషన్ పేపర్స్ మీకు ఇచ్చి.. ఈ పదిరోజుల్లో పెళ్లి చేస్తానని జానూ వాళ్ళకి మాటిస్తుంది. తరువాయి భాగంలో తోట నాది అని సింహాద్రి తన ఫ్రెండ్స్ కి చెప్తుంటే జానూ, సూర్య వెళ్తారు. తోట ఎవరిది అంకుల్ అని జానూ అడుగగా సింహాద్రి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |